రేవంత్ జనజాతర సభ@నారాయణపేట-LIVE
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా నారాయణపేట్ లో కాంగ్రెస్ జనజాతర సభను నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు. మీటింగ్ లైవ్ ను ఈ వీడియో ద్వారా లైవ్ లో చూడొచ్చు.
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా నారాయణపేట్ లో కాంగ్రెస్ జనజాతర సభను నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు. మీటింగ్ లైవ్ ను ఈ వీడియో ద్వారా లైవ్ లో చూడొచ్చు.
నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన యువ సమ్మేళనం కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని.. MSP కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని అధికారులని ఆదేశించారు.
తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఒక్క స్థానంలో కూడా మాదిగలకు పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంపై మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సొంత పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై అయినా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సీఎం రేవంత్ మూడు సార్లు ప్రమాదల నుంచి తప్పించుకున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో కారు టైరు పేలింది. ఏ ప్రమాదం జరగపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్’ అని అన్నారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని 58 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తప్పుడు హమీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అన్నారు డీకే అరుణ. తెలంగాణ ప్రజలకు మోసం చేసింది చాలక, ఇప్పుడు ఐదు గ్యారెంటీల పేరుతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆ పార్టీ మేనిఫేస్టో విడుదల చేసిందంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణ లో ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.