డీకే అరుణ నామినేషన్-LIVE
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు.
తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదట్లోనే ఇలా మండిపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది.తొమ్మిది జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2023 పరీక్ష ఫలితాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు పేదింటి బిడ్డ సత్తా చాటింది. తొలిప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. దోనూరు అనన్య రెడ్డి సక్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రైతులకు రూ. 2లక్షల మేర రుణమాఫీ చేస్తామని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడారు. తెలంగాణలో 15ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తామన్నారు.
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా నారాయణపేట్ లో కాంగ్రెస్ జనజాతర సభను నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు. మీటింగ్ లైవ్ ను ఈ వీడియో ద్వారా లైవ్ లో చూడొచ్చు.
నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన యువ సమ్మేళనం కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని.. MSP కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని అధికారులని ఆదేశించారు.
తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఒక్క స్థానంలో కూడా మాదిగలకు పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంపై మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సొంత పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై అయినా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సీఎం రేవంత్ మూడు సార్లు ప్రమాదల నుంచి తప్పించుకున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో కారు టైరు పేలింది. ఏ ప్రమాదం జరగపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.