New Osmania Hospital: ఈ నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఈ రోజు అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలన్నారు.

New Update
Telangana CM Revanth Reddy

Telangana CM Revanth Reddy

New Osmania Hospital: హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రికి  సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇది కూడా చదవండి: Dil Raju : తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన దిల్ రాజు

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లు..

అధికారులు వివరించిన మ్యాప్‌లలో ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి(Osmania Hospital) నిర్మాణం ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: రేపటి బీఆర్ఎస్ రైతు ధర్నా వాయిదా.. కారణమిదే!

అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా నిర్మాణం ఉండాలని సీఎం అధికారులకు వివరించారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Also Read : సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు