TG News: కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. TSను TGగా మార్చేందుకు వెయ్యికోట్లు ఖర్చు చేస్తారా అంటూ కేటీఆర్ కామెంట్స్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా! లేక లెక్కల్లో మీరు వీకా?' అంటూ సెటైర్స్ వేశారు. Hello @RahulGandhi ji,Rs 1000 crore- the cost of one inflated ego! Rs 1000 crore- the cost of One Letter 50,000 farmers could have had 2 lakh rupees wavier! 40 lakh women could have received the promised Rs 2,500 25 lakh old people could have received the promised Rs… pic.twitter.com/K4AT3OcBDW — KTR (@KTRBRS) January 4, 2025 ఇది కూడా చదవండి: Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేరు.. ఈ మేరకు టీఎస్ ను టీజీగా మార్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్.. వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చు చేసినా తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేరన్నారు. అయితే దీనిపై కౌంటర్ గా స్పందించిన ఎంపీ చామల.. "కేటీఆర్ గారూ.. మీకు గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా! లేక లెక్కల్లో మీరు వీకా? 1.30 కోట్లను రూ.1000 కోట్లుగా మార్చి, ఏమార్చి చెప్పే అలవాటు మీ అయ్య నుంచి నేర్చుకున్నారా? లేక మీ బుద్ధే అంతనా? ఇగోకు కేరాఫ్ అడ్రస్ నువ్వు అని తెలంగాణలో గల్లి పిల్లగాడు కూడా చెబుతాడు. టీఎస్ నుంచి టీజీ పేరు మార్పులో నీకు ఇగో కనిపించింది. తెలంగాణ ప్రజలకు మాత్రం సెంటిమెంటే కనిపించింది. జనం టీజీ కోరుకుంటే నీ పార్టీ పేరుకు కలిసొస్తుందని దాన్ని టీఎస్‌గా మార్చిన కక్కుర్తి మీది. దందాల కోసం కూలేశ్వరం.. కమీషన్ల కోసం ఫార్ములా-ఈ రేస్, ధరణి పేరుతో భూ దందాలు.. ఇది కదా మీ చరిత్ర" అంటూ చామల విమర్శలు గుప్పించారు. కేటీఆర్ గారూ… మీకు గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా…! లేక లెక్కల్లో మీరు వీకా…!1.30 కోట్లను రూ.1000 కోట్లుగా మార్చి, ఏమార్చి చెప్పే అలవాటు మీ అయ్య నుండి నేర్చుకున్నారా…..! లేక మీ బుద్ధే అంతనా…!? ఇగోకు కేరాఫ్ అడ్రస్సు నువ్వు అని తెలంగాణలో గల్లి పిల్లగాడు కూడా… pic.twitter.com/svhqiXS0yo — Kiran Kumar Chamala (@kiran_chamala) January 4, 2025