రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ కారణంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా ప్రమాదాలు ఆగడం లేదు. తాజాగా అలాంటిదే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. ఇది కూడా చూడండి: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన పల్టీలు కొట్టిన కారు తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అదే సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న 40 ఏళ్ల లక్ష్మమ్మ అనే మహిళ పై నుంచి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కూడా చూడండి: బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదంనాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారురోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి పల్టీలు కొడుతూ దూసుకెళ్లిన కారుప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు pic.twitter.com/qeqNNLG9Mv — Telugu Scribe (@TeluguScribe) January 2, 2025 ఆ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఒకరి తప్పుకు మరొకరు బలం కావడం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. అతివేగంగా రావాల్సిన అవసరం ఏముంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో చూసిన వాళ్లు చలించిపోతున్నారు అనే చెప్పాలి. ఏపీలో తెగబడ్డ గంజాయి బ్యాచ్ ఇది కూడా చూడండి: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.. కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు మంగళవారం రాత్రి కిర్లంపూడి మండలం కృష్ణవరం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు ఓ కారు వెళ్తుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆ కారును కూడా కానిస్టేబుళ్లు ఆపారు. ఆ కారును రోడ్డు పక్కకు ఆపుతున్నట్లు డ్రైవర్ నటించాడు.. కానీ కారును ఆపకుండా వేగంగా దూసుకొచ్చాడు. ఆ వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే తోటి సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇది కూడా చూడండి: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే! కారులో గంజాయి స్మగ్లింగ్ మరో కానిస్టేబుల్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారును రాజానగరం సమీపంలోని కెనాల్‌రోడ్డులో పోలీసులు గుర్తించారు . డ్రైవర్ కారును అక్కడ వదిలి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.. ఆ కారులో ఉన్న వారిని పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యూపీకి చెందిన ఆ కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ప్రకటించాల్సి ఉంది. అయితే కారు కానిస్టేబుల్స్‌పైకి దూసుకెళ్లిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.