Girls Hostel: మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కాలేజీ అమ్మాయిల టాయిలెట్ మొబైల్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గర్ల్స్ టాయిలెట్‌లో మొబైల్ ఫోన్‌తో వీడియో ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు సిద్ధార్థను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై 77,79 BNS, 66-E, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. దీంతో సిద్దార్థకు 14రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. పరీక్షకు వెళ్ళేముందు వీడియో రికార్డ్.. ఈ క్రమంలోనే సిద్ధార్థ మొబైల్‌ను FSLకు పంపించేందుకు పోలీసులు కార్యచరన మొదలుపెట్టారు. సిద్ధార్థ ఫోన్‌లో ఆరుగురి అమ్మాయిల వీడియోలు గుర్తించారు. బ్యాక్ లాగ్స్ ఉండడంతో పరీక్షలు రాసేందుకు కాలేజీకి వచ్చిన సిద్దార్థ పరీక్షకు వెళ్ళేముందు గర్ల్స్ టాయిలెట్‌లో మొబైల్‌లో వీడియో రికార్డు ఆన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ సొంతూరు పెద్దపల్లి జిల్లా మంథనిగా నిర్ధారించారు. ఇది కూడా చదవండి: క్లింకార ఫొటోను ఆరోజే రివీల్ చేస్తా.. బాలయ్య, చరణ్ 'అన్ స్టాపబుల్' ప్రోమో అదిరింది అసలేం జరిగిందంటే.. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్‌లో వీడియో రికార్డింగ్‌లు కలకలం రేపాయి. హాస్టల్ బాత్‌రూం వద్ద ఈ యువకుడు మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో పోలీసులు నవీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నాయి. ఇది కూడా చూడండి: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇలాంటిదే మరో ఘటన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఇటీవల స్టూడెంట్స్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై అధికారుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. హాస్టల్ నిర్వహణ సరిగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.