MLA Chittem Parnika Reddy : ఎమ్మెల్యే సంతకాన్నే ఫోర్జరీ చేసి....
అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళను ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఎమ్మెల్యే సంతకం ఉంటే ఉద్యోగం గ్యారంటీ అని ఆ మహిళను నమ్మించాడు. దానికోసం ఏకంగా నకిలీ లెటర్ ప్యాడ్ తయారు చేసి దానిపై తానే సంతకం చేసి ఇచ్చాడు. ఆ సంతకం నకిలీదని తేలడంతో కటకటాల పాలయ్యాడు.