కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయంలో కేటీఆర్ కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడికి చిన్న పాపతో వచ్చిన పేరెంట్స్.. తమ బిడ్డకు పేరు పెట్టాలని కేటీఆర్ ను కోరారు. దీంతో కేటీఆర్ ఆ పాపను ఎత్తుకున్నారు. భూమి నాయక్ అంటూ ఆ చిన్నారికి నామకరణం చేశారు.
లగచర్ల తండాలో జన్మించిన పాపకు "భూమి నాయక్" అని నామకరణం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/QXDp1rsLzM
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) February 10, 2025