/rtv/media/media_files/2025/02/20/KGrJ4bTtJjj0vAKUDzkb.jpg)
BRS New Working Presidents
BRS New Working Presidents: అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) తర్వాత దాదాపు సైలెంట్ అయి ఫామ్ హౌజ్ కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) నిన్న బయటకు వచ్చారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. పార్టీకి కొత్త కార్యవర్గాన్ని నియమించనున్నట్లు తెలిపారు. దీంతో బీఆర్ఎస్‌లో కొత్త చర్చ మొదలైంది. పార్టీలో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండబోతున్నారంటూ చర్చ సాగుతోంది. కేటీఆర్‌తో పాటు ఎస్సీ, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఉండనుందని తెలుస్తోంది. ఎస్సీల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఖాయమని తెలుస్తోంది. బీసీ వర్గం నుంచి మధుసూదనా చారి, శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ మేరకు పార్టీ ప్లీనరీలోపు అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
బీసీల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్..
ప్రస్తుతం తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం సాగుతోంది. బీసీ కుల గణన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తామే ఆ వర్గానికి న్యాయం చేస్తామని చెబుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ గా బీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది హస్తం పార్టీ. తానే ఆఖరి రెడ్డి సీఎంను కావొచ్చని సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ సైతం బీసీ అయిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. రేపే మాపో మరో బీసీని తెలంగాణ పార్టీ చీఫ్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
ఈ నేపథ్యంలో కేసీఆర్ సైతం బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేటీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన మధుసూదనా చారికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే మధుసూదనా చారి ఇప్పుడు మండలిలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయనకు రెండు పదవులు వద్దు అన్న చర్చ వస్తే తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పక్కా..
మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎస్సీ సామాజిక వర్గంలో మంచి ఇమేజ్ ఉంది. దీంతో ఆయన పార్టీలో చేరిన నాటి నుంచే కీలక పదవి పక్కా అన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ కు డిప్యూటీ సీఎం కూడా ఇస్తామని కేసీఆర్ ప్లీనరిలో ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఏప్రిల్ 27న నిర్వహించనున్న బహిరంగ సభలో లేదే అంతకు ముందే వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!