ACB RAIDS: రేప్​ కేసులో ఛార్జ్​షీట్ మారుస్తామని డబ్బులు డిమాండ్... ఏసీబీ అటాక్

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో స్పీడు పెంచింది. ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా ఝులిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, పోలీసులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటున్నారు. తాజాగా సీఐ,ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు.

New Update
 ACB rides

ACB rides

ACB RAIDS: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో స్పీడు పెంచింది. ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా ఝులిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, పోలీసులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటున్నారు. అక్రమంగా ప్రజల నుంచి లంచాలు స్వీకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మాటువేసి మరీ ఆధారాలతో సహా పట్టుకుంటుంది. అయినా కొందరి ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలో ఏసీబీ మరింత జోష్​తో దూసుకుపోతోంది. తాజాగా ఏసీబీ అధికారులు సీఐ,ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు.

Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్
 
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట జిల్లా మక్తల్‌ సర్కిల్ ఇన్స్​పెక్టర్ చంద్రశేఖర్‌తో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహాలు ఏసీబీకి చిక్కారు. వీరు రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మహబూబ్​నగర్​కు చెందిన సంధ్యా వెంకట రాములు గౌడ్​పై కొద్ది రోజుల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్​ పోలీస్​ స్టేషన్​లో ఐపీసీ 506, 376 సెక్షన్ల ప్రకారం రేప్​ కేసు నమోదైంది. దీంతో ఆ వ్యక్తి హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేసి బెయిల్​ తెచ్చుకున్నాడు. బెయిల్​ ఇచ్చేటప్పుడు హైకోర్టు నిందితుడికి కొన్ని షరతులు పెట్టింది. అందులో భాగంగా ప్రతి సోమవారం మక్తల్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి సంతకం చేయాలని సూచించింది.

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

రూ.20వేలు ఇస్తుండగా..

సంతకం పెట్టాలనే విషయాన్ని ఆసరాగా చేసుకున్న మక్తల్​ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుళ్లు​ శివారెడ్డి, నరసింహాలు నిందితుడికి అనుకూలంగా ఛార్జ్​షీట్ మార్చడానికి రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో సంధ్యా వెంకట రాములు గౌడ్​ ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఉదయం మక్తల్​ సీఐ చంద్రశేఖర్​కు రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.  

Also Read: అలెర్ట్.. కార్లు కడిగితే రూ. 5 వేల ఫైన్.. రిపీట్ చేస్తే వాచిపోద్ది!

Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో! 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు