Palamuru Project: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కోర్టులో ఉందని తెలిపింది. అందుకే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది.