డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తిలో జరిగింది. ఓ మహిళకు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విఫలం కావడంతో పసికందును రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు.

New Update
Wanaparthy crime

Wanaparthy crime Photograph: (Wanaparthy crime)

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి ప్రాణాలను కాపాడేందుకు చివరకు ప‌సికందు త‌ల‌, మొండెంను వేరు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణీకి నెల‌లు నిండాయి.

ఇది కూడా చూడండి:Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ప్రసవం చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి..

ఈ క్రమంలో ఆమెను అమ‌ర‌చింత ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్ న‌ర్సు డెలివరీ చేయడానికి ప్రయత్నించగా విఫలమైంది. దీంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రసవం చేస్తుండగా.. పిండం వెనుక భాగం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇది కూడా చూడండి:USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

దీంతో డాక్టర్లు చేతులు ఎత్తేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేట్ వైద్యులు పసికందు తల మొండెం రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

ఇది కూడా చూడండి:Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులు సరిగ్గా పనిచేస్తే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు