TG News: తెలంగాణ గ్రూప్1 పరీక్ష ఫలితాల్లో మహబూబ్ నగర్ నారాయణపేట అమ్మాయి వీణ అదరగొట్టింది. మల్టీజోన్ 2లో 3వ ర్యాంక్ సాధించింది. ఆర్టీసీ కండక్టర్ కూతురు అయిన వీణ స్టేట్ 118 ర్యాంక్ సాధించడంతో తమ కల నెరవేర్చిందంటూ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టు వచ్చే అవకాశం ఉంది.
చిన్నప్పటి నుండి చదువులో నంబర్ 1
ఈ సందర్భంగా RTVతో మాట్లాడిన వీణ తల్లిదండ్రులు.. చిన్నప్పటి నుండి చదువులో వీణ నంబర్ వన్ అని చెప్పారు. చదువుతో పాటు ఇంటి పనుల్లోనూ సాయం చేస్తుందని, చిన్ననాటి నుండి కలెక్టర్ అవుతానంటూ చెప్పేదని, ఈరోజు ఆ కలను నిజం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!
'మా బిడ్డకు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్టు వచ్చే అవకాశం ఉంది. కండక్టర్ గా పని చేస్తున్న నా కూతురు కలెక్టర్ కాబోతుంది అనే వార్త నాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తోంది. RTC నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డీఎస్పీలు, జాయింట్ కలెక్టర్‌లు హాజరవుతుంటారు. నా కూతురు కూడా అలా ముఖ్య అతిథిగా హాజరయ్యే స్థాయికి ఎదగడం గొప్పగా అనిపిస్తోంది. మా బంధుమిత్రులు, జిల్లావాసుల నుండి పెద్ద ఎత్తున ప్రశంశలు అందుతున్నాయి. ఎన్నడు ఫోన్ కూడా చేయని వారు సైతం ఇప్పుడు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు' అంటూ ఆనందపడిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్ మహిళా మావోయిస్టు మృతి
group-1 | telangana | toppers | telugu-news | today telugu news