/rtv/media/media_files/2025/11/09/jubilee-hills-mla-2025-11-09-06-47-09.jpg)
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి(maganti gopinath death) పై బిగ్ ట్విస్ట్ నెలకొంది. పై అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి మహానందకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చూసేందుకు తనను నిరాకరించారని.. కేటీఆర్‌ను మాత్రం లోనికి వెళ్లనిచ్చారని ఆమె పేర్కొన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని, మరణాన్ని ధ్రువీకరించడంలోనూ ఆలస్యమైందని ప్రస్తావించారు. ఈ మేరకు ఆమె శనివారం సాయంత్రం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు అందించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాగంటి గోపినాథ్ జూన్ 8న తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కారణంగా ఆయన రెండు ఫ్యామిలీల మధ్య గొడవ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ.. పాటని అవమానిస్తూ యువకులు రీల్స్.. ACF ఆగ్రహం
Maganti Gopinath Mother Filed A Complaint
మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు:
— Telangana Nestham (@TNestham) November 6, 2025
"ప్రద్యుమ్న తారక్ నా మనవడు. కొడుకుగా రావాల్సిన హక్కులు రావాల్సిందే. సునీత పోటీ విషయం నాకు తెలియజేయలేదు. తండ్రి లేని బిడ్డకు న్యాయం కావాలి."#Mahanandakumari#GopinathMaganti#PradyumnaTarak#JusticeForGrandson#TeluguNews#ControversialStatementpic.twitter.com/5TpQ9PZx1n
పోలీసులకు ఇచ్చిన కంప్లైయింట్‌లో మాగంటి గోపినాథ్(mla maganti gopinath) తల్లి ఇలా రాసుకొచ్చారు. గోపీనాథ్ అనుమానాస్పద పరిస్థితుల మధ్య మృతిచెందాడు. మరణానికి ముందు నా కుమారుడు అనేక అనారోగ్య సమస్యలతో(maganti gopinath health issues) బాధపడ్డాడు. 2025 జూన్ 5న గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరాక.. దిషిర(గోపీనాథ్ కుమార్తె) సంతకం చేసిన ఓ లెటర్‌కారణంగా నా కుమారుడిని చూసేందుకు భద్రతా సిబ్బంది నన్ను అనుమతించలేదు. గోపీనాథ్ కొన్ని నెలల వైద్య పరీక్షల ఫలితాలు గమనించగా.. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల గుర్తించా. అయినప్పటికీ అతనితో ఉండేవారు సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. డయాలసిస్ చేయడంలో జాప్యం, మూత్రపిండాల తొలగింపు తర్వాత తీసుకున్న నిర్ణయాలు, మరణానికి దారితీసిన పరిణామాలపై సమగ్రంగా విచారణ జరపాలి. నిజాల్ని వెలికితీయాలి’ అని మహానంద కుమారి ఫిర్యాదులో కోరారు. ఏఐజీ ఆసుపత్రిలో మెడికల్ టెస్టుల రిపోర్ట్స్, చికిత్స వివరాలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ పోలీసులకు అందించారు. ఆమె ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు.
Also Read : మీ తాటతీస్తాం.. వాళ్లకు పవన్ కళ్యాణ్ లాస్ట్ వార్నింగ్
Follow Us