Viral News: తెలంగాణలో దారుణం.. కూల్ డ్రింక్‌లో బల్లి- ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న యువకుడు! (వీడియో)

మెదక్ జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్‌లో దారుణం జరిగింది. కూల్‌డ్రింక్ తాగి ఓ యువకుడు హాస్పిటల్‌ పాలయ్యాడు. హోటల్‌కు వచ్చిన ముగ్గురు యువకులు కూల్‌ డ్రింక్ తాగారు. అందులో యాదుల్ అనే యువకుడి డ్రింక్‌లో బల్లి కాలు ఉండటంతో అది తాగి అస్వస్థతకు గురయ్యాడు.

New Update
Lizard in Cool Drink Shocks Diners in Hyderabad

Lizard in Cool Drink Shocks Diners in Hyderabad

కల్తీ.. కల్తీ.. కల్తీ- ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ఏది తిందామన్నా భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఎండ వేడికి చిన్న కూల్ డ్రింక్, జ్యూస్.. ఇలా ఏది తాగుదామన్నా అందులో ఏముంటుందోనన్న భయం. పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే ఫుడ్ సేప్టీ అధికారులు సైతం పలు హోటళ్లపై రైడ్స్ చేసి నాశిరకంగా ఉన్న హోటళ్లు, కుళ్లిపోయిన మాంసాలు, పాడైపోయిన పదార్థాలు గుర్తించి వాటిని సీజ్ చేశారు. 

ఇది కూడా చూడండి: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

తాజాగా అలాంటిదే జరిగింది. బాగా ఎండగా ఉండటంతో ఓ ముగ్గురు యువకులు హోటల్‌కు వెళ్లారు. అక్కడ కూల్‌డ్రింక్ తీసుకున్నారు. ముగ్గురు సగం తాగారు. అందులో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో గజిబిజి అయిపోయాడు. ఏమైందా అని అతడు తాగిన కూల్‌డ్రింక్ చూసి.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మరి ఆ డ్రింక్‌లో ఏముంది? అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

డ్రింక్ తాగి హాస్పిటల్‌పాలు

తెలంగాణలోని సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని ఒక హోటల్ ఉంది. బాగా ఎండగా ఉండటంతో ముగ్గురు స్నేహితులు ఆ హోటల్‌కు వచ్చారు. వెంటనే కూల్‌డ్రింక్ ఆర్డర్ చేయగా.. సర్వర్ తెచ్చి ఇచ్చాడు. అప్పటికే బాగా ఎండలోంచి వచ్చిన ఆ ముగ్గురు చల్ల చల్లని కూల్ డ్రింక్‌ను సగం తాగేశారు. అందులో యాదుల్ అనే యువకుడు వెంటనే తీవ్ర కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. 

Also Read :  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!

దీంతో అతడికి ఏమైందో అని తోటి ఫ్రెండ్స్ కంగారు పడ్డారు. వెంటనే యాదుల్ తాగిన డ్రింక్‌ను చెక్ చేశారు. అందులో క్షుణ్ణంగా పరిశిలించడంతో.. బల్లి కాలు, దాని అవశేషాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లినా.. వారు పెద్దగా స్పందించలేదు. ఆ యువకులకు సరైన సమాధానం చెప్పలేదు. వారి తీరుపై ఆ యువకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం అస్వస్థతకు గురైన తమ స్నేహితుడ్ని సమీప హాస్పిటల్‌లో చేర్చారు. ఈ ఘటనపై వారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

crime news | telangana-crime | latest-telugu-news | telugu-news | cool-drinks

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు