Kaleshwaram: సరస్వతి పుష్కరాలు చివరిరోజు.. కొనసాగుతున్న భక్తుల రద్దీ

కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈరోజు చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముకేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

New Update
last day of saraswati pushkaram, Crowd Continuing in Kaleshwaram

last day of saraswati pushkaram, Crowd Continuing in Kaleshwaram

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఈరోజుతో పుష్కరాలు ముగియనున్నాయి. సోమవారం చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆ తర్వాత కాళేశ్వర ముకేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈరోజు అట్టహాసంగా ముగింపు వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు మే 15న ప్రారంభమయ్యాయి. 

Also Read: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Saraswati Pushkaralu Last Day

గతంలో ఉత్తరాదిన ఉన్న ప్రయాగ్‌రాజ్‌ వద్ద మాత్రమే సర్వస్వతి పుష్కరాలు జరిగేవి. అయితే ఈ సాంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది. దీంతో దేశంలో నలుమూలల నుంచి  భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరానికి వస్తున్నారు. త్రివేణి సంగమానికి చీరెసారెను సమర్పిస్తున్నారు. సైకత లింగాలకు పూజలు చేస్తున్నారు. తమ పూర్వీకులను స్మరించుకుంటూ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. 

Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI!

ఆదివారం కూడా కాళేశ్వరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ నెలకొంది. సెలవురోజు కావడంతో భక్తులు పోటెత్తారు. మూడు వైపుల నుంచి వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోయాయి.  గవర్నర్‌ జిష్ణదేవ్‌ వర్మ దంపతులు కూడా పుష్కరాలకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. గవర్నర్ దంపతులకు మంత్రి శ్రీధర్‌ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ ఖరే స్వాగతం పలికారు. ఇక మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా పుష్కరాల్లోపుణ్యస్నానాలు చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. 

Also Read :  అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?

Also Read: ప్రభుత్వం కీలక నిర్ణయం.. తాజ్ మహల్ వద్ద యాంటీ డ్రోన్ సిస్టం

telugu-news | rtv-news | saraswathi-devi | kaleshwaram

Advertisment
Advertisment
తాజా కథనాలు