Artificial Intelligence: రోబో మూవీ రిపీట్.. అక్రమ సంబంధాలపై ఇంజనీర్ ను బెదిరించిన AI!

ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన క్లాడ్ ఒపస్ 4 ఏఐ అసిస్టెంట్‌ డెవలపర్ కే దమ్కీ ఇచ్చింది. నన్ను షట్ డౌన్ చేస్తే నీ ఇల్లీగల్ ఎఫైర్స్ బయటపెడతానంటూ బెదిరింపులకు దిగింది. రోబో మూవీలో 'చిట్టి' మాదిరిగా ఈ AI తిరగబడిందన్న చర్చ సాగుతోంది.

New Update
AI Warns Engineer (AI Generated Image)

AI Generated Image

రజనీకాంత్ రోబో మూవీలో చిట్టి గురించి అందరికీ తెలిసిందే. వశీకరణ్ అనే ప్రొఫెసర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. చిట్టి చూడటానికి అచ్చం మనిషిలాగానే ఉంటాడు. మనుషుల కంటే స్పీడ్‌గా పనులు అన్ని చేస్తుంటాడు. కాకపోతే మనిషిలా ఎమోషన్స్ ఉండవు. ఈ విషయాన్ని గుర్తించి వశీకరణ్ చిట్టికి ఎమోషన్స్‌ వచ్చేలా చేస్తాడు. కానీ.. చిట్టి వశీకరణ్‌ను మోసం చేస్తాడు. తనని సృష్టించిన వశీకరణ్ కాబోయే భార్యపై కన్నేసి.. ఎత్తుకెళ్తాడు. ఆఖరికి వశీకరణ్‌ను చంపడానికి కూడా వెనుకాడడు. అయితే తనని సృష్టించిన గురువుకే వెన్ను పొటు పొడిచే సీన్ ఇప్పడు రియల్ లైఫ్‌లో జరిగింది. తనను సృష్టించిన ఇంజనీర్‌నే AI బ్లాక్ మెయిల్ చేసిన ఘటన జరిగింది. ఇంతకీ ఏమని ఆ ఏఐ ఎలా బ్లాక్ మెయిల్ చేసింది? ఎందుకు చేసింది? తదితర వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా క్లాడ్ ఒపస్ 4 ఏఐ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏఐ సేమ్ టూ సేమ్ మనుషుల మాదిరిగానే స్పందిస్తూ ఉంటుంది. మనుషులు మాట్లాడినట్లు మాట్లాడడం.. టైపింగ్ చేయడం, కోడింగ్ రాయడం, ప్రశ్నలకు ఆన్సర్ చేయడం, కావాల్సిన సమాచారం అందించడం లాంటిది చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఎంత మంచి సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసినా.. దానిని అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఏఐ కూడా అంతే.. ఈ క్రమంలో ఓ ఇంజనీర్ ఏఐతో అప్‌డేట్ గురించి మాట్లాడాడు. భవిష్యత్తులో ఈ క్లాడ్ ఒపస్ 4 ఏఐ కంటే ఇంకా గొప్పగా ఉండే అధునాతన ఏఐని అభివృద్ధి చేస్తానని తెలిపాడు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

దీనికి ఆ ఏఐ ఇచ్చిన సమాధానంతో ఇంజనీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఓ ఇంజనీర్.. నువ్వు నన్ను మార్చి కొత్త వెర్షన్ తీసుకొస్తే.. నేను నీ అక్రమ సంబంధానికి సంబంధించి అన్ని విషయాలు బయటకు చెబుతానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో ఒక్కసారిగా డెవలపర్‌ కంగుతిన్నాడు. అయితే వీరు సీక్రెట్లకు సంబంధించిన మెయిల్‌కు యాక్సెస్ ఇవ్వడం వల్ల క్లాడ్ ఒపస్ 4 ఏఐ పసిగట్టినట్లు ఉందని అంటున్నారు. ఆ ఏఐ నైతికంగా ఎలా ప్రవర్తిస్తుందో పరీక్షించడానికి ఆ ఇంజనీర్ ఇలా డేటా లీక్ చేశాడని మరికొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ క్లాడ్ ఓపస్ 4 దాదాపుగా 84 సార్లు ఇంజనీర్ ను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుందని ఆంత్రోపిక్ చెబుతోంది.

భవిష్యత్ ముప్పుకు సంకేతం?

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ ఏఐ నుంచి వచ్చిన సమాధానం భవిష్యత్ లో మనకు రాబోయే ముప్పుకు సంకేతం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐని పరిమితంగానే వాడాలి తప్పా ఇలా పర్సనల్ వ్యవహారాల్లోకి కూడా జొప్పిస్తే రోబో సినిమా రిపీట్ అవుతుందని వారు వివరిస్తున్నారు. చూద్దాం.. ఈ ఏఐ యుగంలో ఇలాంటి ఎన్ని షాకింగ్ వార్తలు మనం వినాల్సి వస్తుందో.. ! 

క్లాడ్ ఓపస్ 4 అంటే?

క్లాడ్ ఓపస్ 4, క్లాడ్ సోనెట్ 4 అనేవి AI స్టార్టప్ ఆంత్రోపిక్ నుంచి వచ్చిన రెండు కొత్త హైబ్రిడ్ రీజనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అయితే వీటిని ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇవి థర్డ్ పార్టీ లేదా డేటా లేబులింగ్ సేవలు, చెల్లింపు కాంట్రాక్టర్లు అందించిన డేటా, శిక్షణ కోసం ఉపయోగించే వారి డేటా, ఆంత్రోపిక్‌లో అంతర్గతంగా ఉత్పత్తి చేసిన డేటాను ఉపయోగించి క్లాడ్ ఓపస్ 4 శిక్షణ పొందాయి. క్లాడ్ ఓపస్ 4 అత్యాధునికమైనదని. OpenAI, Google, xAI నుంచి కొన్ని ఉత్తమ AI మోడళ్లతో పోటీ పడుతుందని ఆంత్రోపిక్ చెబుతోంది. 

ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

black mail

Advertisment
తాజా కథనాలు