Covid-19 India: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

దేశంలో కరోనా రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 478 కేసులు నమోదు కాగా.. 278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా NB.1.8.1, LF.7 అనే వేరియంట్ల కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసులు ఉన్నాయి.

New Update
Health News: కరోనా బాధితులకు షాకింగ్‌ న్యూస్.. వెంటనే డాక్టర్‌ను కలవండి!

Covid

దేశంలో కరోనా భీభత్సంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుఉతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ ఏడాది కోవిడ్‌ తొలి మరణం కర్ణాటకలో నమోదైంది. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒక 85 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ముందుగా ఇతనికి పరీక్షలు చేయగా కోవిడ్ ఉన్నట్లు తేలింది.

ఇది కూడా చూడండి:Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చూడండి:BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

రెండు కొత్త వేరియంట్లు..

ఇదిలా ఉండగా దేశంతో రెండు కొత్త వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను గుర్తించారు. అయితే తమిళనాడులో గత నెలలో NB.1.8.1 కోవిడ్ వైరస్ నమోదు కాగా ఈ నెలలో నాలుగు LF.7 కేసులను అధికారులు గుర్తించారు. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 478 కేసులు కాగా.. 278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్‌ పాజిటివ్ అని తేలింది. అయితే మహారాష్ట్రలో కొత్తగా 47 కొత్త కేసుల నమోదయ్యాయి. 

ఇది కూడా చూడండి:BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Advertisment
Advertisment
తాజా కథనాలు