BREAKING: అందుకే ప్రమాదం జరిగింది.. ట్రావేల్స్ యాజమాన్యం కీలక ప్రకటన!

శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్‌లో కావేరీ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

New Update
kaveri-travels-responds on kurnool-tragedy

kaveri-travels-responds on kurnool-tragedy


శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్‌లో కావేరీ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ బస్సుకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్ లేదని.. సర్టిఫికేట్లు కూడా కాల పరిమితిని దాటాయని.. అనేక చలాన్లు ఉన్నాయంటూ జనాలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై వేమూరీ కావేరి ట్రావెల్స్‌ యాజమాన్యం స్పందించింది.  తమ బస్సుకు అన్ని ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు వ్యాలిడ్‌లోనే ఉన్నాయని పేర్కొంది.  ఆ సంస్థ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరుమీద ఓ ప్రకటన వెల్లడైంది. 

Also Read: కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి...  ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం

'' రాత్రి ప్రమాదం జరిగినట్లు తెల్లవారుజామున 3.30 గంటలకు మాకు సమాచారం వచ్చింది. వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై వస్తున్న బైకర్‌ అదుపుతప్పి బస్సును ఢీకొట్టి పడిపోయాడు. బైక్‌లో చెలరేగిన మంటలు బస్సు కిందకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మాకు తెలిసింది. మెయిన్‌ డోర్ వద్ద మంటలు రావడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. దీంతో మా డ్రైవర్లు బస్సు అద్దాలను రాడ్లతో పగలకొట్టడంతో కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మా బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అన్ని కూడా వ్యాలిడ్‌లోనే ఉన్నాయి. ఆ బస్సులో 40 మంది రిజర్వ్డ్‌ ప్రయాణికులు ఉన్నారు. 

మా ఏజెన్సీ తరఫున ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ ప్రమాదంపై మేము విచారణ వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని'' బస్సు యాజమాన్యం పేర్కొంది. మరోవైపు ఈ ప్రమాదంలో కావేరీ ట్రావెల్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు చెబుతున్నారు. కనీస ఫైర్ సెఫ్టీ లేదని అంటున్నారు. అంతేకాదు ప్రమాదం సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉందని.. మంటలు ఆర్పేందుకు ఫోమ్ బాటిల్ కూడా అందుబాటులో లేదని అంటున్నారు. సెఫ్టీ విండో బద్ధలు కొట్టేందుకు సుత్తి కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. 

Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే చెప్పాల్సిందే.. కేంద్రం IT చట్టంలో మార్పులు!

బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కారణమని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. బైక్‌ ఢీకొన్న వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగేవి కాదని చెబుతున్నారు. మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసి, మెయిన్ డోర్ తెరిచి ఉంటే ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడేవారని బస్సులో గాయపడిన వారు చెబుతున్నారు. మొత్తంలో ఈ బస్సు ప్రమాదంలో బైకర్‌తో కలిపి 20 మంది మృతి చెందారు. 

Advertisment
తాజా కథనాలు