KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

ఫార్ములా-ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

New Update
ktr acb

ktr acb Photograph: (ktr acb)

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఫార్మర్ రేసు కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం...మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది.  ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు తెలిపింది. అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది. అయితే హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్‌ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!

ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...

కేసు ఏంటంటే?

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహణలో ఉల్లంఘణలు జరిగాయని కేటీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందు నిధులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. 

ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్‌ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్‌ ప్రధాని!

హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు రూ. 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ కేసు విషయంలో కేటీఆర్‌తో పాటు పురపాలక శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్‌కు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు