/rtv/media/media_files/2025/05/27/8ia3mtHG06tRduvukjX0.jpg)
లండన్, అమెరికా పర్యటనకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బయలుదేరారు. అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొననున్న కేటీఆర్… అలాగే లండన్ లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి
KTR Leaves For London And US Tour
అలాగే లండన్‌లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్న కేటీఆర్. మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు ఆర్.అండ్. డి సేవలను అందించే పీడీఎస్‌ఎల్ (Pragmatic Design Solution Limited ) నాలెడ్జ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు కేటీఆర్. తన పర్యటనలో వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కలవనున్నారు.
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీ డల్లాస్)లోని భారతీయ విద్యార్థులను జూన్ 2 న కేటీఆర్ కలుస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచిన కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్ తో పాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ మాట్లాడనున్నారు.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్
ముందుగా యూకేలో పర్యటించే కేటీఆర్, బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్‌లో జరుగనున్న ఇండియా వీక్ 2025లో ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరిస్తారు.
మొబిలిటీ టెక్నాలజీలో తెలంగాణ ఆధారిత ఆవిష్కరణలకు సాక్ష్యంగా 2 25 (Pragmatic Design Solution Limited) నాలెడ్జ్ సెంటర్ ను అదే రోజు వార్విక్లో కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక నీర్ షోర్ హార్డ్వేర్-ఇన్-లూప్ (హెచ్ఐఎల్) టెస్ట్ సెంటర్ ఉంది. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీల కోసం అధునాతన ఆర్ అండ్ డీ సేవలను పీడీఎస్ఎల్ అందిస్తుంది.
Also Read: దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం
అమెరికాలో ఎన్ఆర్ఐలు నిర్వహించే కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారు.బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్నారైలు పాల్గొంటారు.
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీ డల్లాస్)లోని భారతీయ విద్యార్థులను జూన్ 2న కేటీఆర్ కలుస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్తో పాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
brs-working-president-ktr | london | america | telugu-news | Breaking Telugu News | latest telugu news updates | latest-telugu-news