Telangana: ఆ రోడ్లకు టోల్‌ విధించం.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు.

New Update
Komati Reddy Venkat reddy

Komati Reddy Venkat reddy

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వెయిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లకు 40 శాతం బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఆరు లేదా మూడు నెలలకొకసారి చెల్లిస్తామని పేర్కొన్నారు. 

Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

Komatireddy Key Comments

బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేసినట్లు విమర్శించారు. ఈ ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు చివరికి సింగరేణి నిధులు కూడా వినియోగించిట్లు ధ్వజమెత్తారు. దీనిపై ఛాలెంజ్ చేస్తున్నానని.. రాష్ట్రమంతా తిరిగి చుద్దామా అని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. 

Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!

కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కూడా స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తు్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్ అండ్ బీ చేపట్టిన పనుల గురించి లెక్కలు తీద్దామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపైనే ప్రత్యేకంగా ఒకరోజు చర్చలు జరుపుదామని పేర్కొన్నారు.  

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్

 

latest-telugu-news | today-news-in-telugu | telugu breaking news | rtv-news | roads | komati-reddy-venkat-reddy

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు