ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్లకు ఇంట్లో భారీఎత్తున డబ్బు కనిపించింది. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కోలిజియం స్పందించింది. ఆయన్ని మరో హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఢిల్లీలో లేరు. దీంతో ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Also Read: విద్యార్థులకు శృంగార పాఠాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది ఇంట్లో మంటలు ఆర్పేశాక భారీ ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అది లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. చివరికి ఈ విషయం చీఫ్ జస్టీస్ సంజీవ్ ఖన్నా దృష్టికి చేరింది. దీనిపై సీరియస్ అయిన ఆయన కొల్లీజియం మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
వర్మ గతంలో కూడా అక్కడే పనిచేశారు. 2021లో ఢిల్లీకి వచ్చారు. ఐదుగురు సభ్యులుండే కొలీజియంలో కొందరు న్యాయవాదులు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడ్డారు. బదిలీ వల్ల న్యాయశాఖ ఇమేజ్ తిరిగిరాదని చెప్పారు. యశ్వంత్ వర్మను రాజీనామా చేయాలని కోరడమే లేదా ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమే చేయాలని సూచించారు.
Also Read: మరో డిజిటల్ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
ఇదిలాఉండగా ఇలాంటి ఘటనే 2008లో కూడా జరిగింది. అప్పటి పంజాబ్ -హర్యాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి ముందు రూ.1 లక్షల నోట్లు ఉన్న బాక్స్‌ను కొందరు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఆ తర్వాత 2011లో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్మల్ యాదవ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 2009 వరకు ఆమె పంజాబ్-హర్యానా కోర్టులో పనిచేశారు. అయితే కేసు తీర్పుకు సంబంధించి నిర్మల్ యాదవ్‌కు ఇవ్వాల్సిన డబ్బు జస్టిస్ నిర్మల్ జిత్ కౌర్ ఇంటి వద్దకు వెళ్లినట్లు బయటపడింది.
telugu-news | rtv-news | delhi-high-court | national-