/rtv/media/media_files/2025/03/21/FUKEdIT9uR2m8j1l9hC3.jpg)
mfhussain
1950ల నాటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ అరుదైన రికార్డు ధరను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎంఎఫ్ హుస్సనే పెయింటింగ్‌లలో అత్యంత గణనీయమైన, ముఖ్యమైన పెయింటింగ్‌గా పేరొందిన అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) ఏకంగా 118 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.
Also Read: New Jersey:ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేసిన మేయర్..
ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో.. ఈ పెయింటింగ్‌ను 13.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షెర్గిల్ 1937లో వేసిన "ది స్టోరీ టెల్లర్" పెయింటింగ్‌ను 2023లో ముంబయిలో వేలం వేయగా 7.4 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.61.8 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా రికార్డు ఉన్నట్లు సమాచారం.
Also Read: AP Govt: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ .. రేపు ఖాతాలోకి రూ.6,200 కోట్లు
పెయింటింగ్ రికార్డు ధరను....
అయితే తాజాగా దీన్ని వెనక్కి నెడుతూ.. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రికార్డు ధరను సొంతం చేసుకుంది. గతంలో రికార్డులో ఉన్న ధర కంటే రెండు రెట్లు ఎక్కువకు అమ్ముడు పోయింది.ఎంఎఫ్ హుస్సేన్ కుంచె నుంచి జాలువారిన ఈ గ్రామ్ యాత్రను దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో వేశారు. ఒకే కాన్వాస్‌లో మొత్తంగా 13 ప్రత్యేకమైన చిత్రాలతో రూపొందించారు. అయితే దీన్ని తాజాగా ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో వేలం నిర్వహించారు. ఈ క్రమంలోనే దీన్ని 13.8 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నారు.
దీంతో సదరు సంస్థ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అద్భుత కళాఖండం కొత్త రికార్డు సృష్టిండంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని క్రిస్టీస్ సౌత్ ఏషియన్ మోడ్రన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ అధిపతి నిషాద్ అవారి చెప్పుకొచ్చారు. 1954వ సంవత్సరంలో భారత దేశాన్ని వదిలి ఈ పెయింటింగ్ వెళ్లింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీన్ని కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి ఎక్కడా పెద్దగా ఈ పెయింటింగ్ కనిపించలేదు.
అయితే ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోసం థోరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని స్థాపించేందుకు ఢిల్లీకి వచ్చారు. ఈక్రమంలోనే 1964లో వోలోడార్స్కీ ఈ పెయింటింగ్‌ను ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందజేశారు. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుందని కూడా వెల్లడించారు.అయితే గతేడాది లండన్‌లో నిర్వహించిన వేళంలో 3.1 మిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.25.7 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడు పోయింది. ఒక్క సంవత్సరంలోనే తిరిగి దీన్ని వేలంలో పెట్టగా రికార్డు ధర పలికింది.
Also Read: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
Also Read: చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ !
mf hussain | PAINTING' | latest-news | latest-telugu-news | latest telugu news updates