/rtv/media/media_files/2025/09/04/khairatabad-ganesh-immersion-2025-09-04-12-53-06.jpg)
Khairatabad ganesh immersion
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు(Hyderabad Ganesh Visarjan 2025) ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి(khairatabad-ganesh-immersion) జనాలు తండోపతండాలుగా వెళ్తారు. ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రారంభిస్తారు. గణేష్‌ను నిమజ్జనం చేసే ముందు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి గణేష్ నిమజ్జనం ప్రారంభం కానుండటంతో గురువారం అర్థరాత్రి వరకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. శనివారం శోభాయాత్ర, నిమజ్జనం ఉండటంతో ఏర్పాట్లు చేసుకోనున్నారు. అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేసే ముందు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చివరిగా గణేష్‌కి పూజలు నిర్వహించి, హారతి ఇచ్చి నిమజ్జనం చేస్తారు. గురువారం అర్థరాత్రి దర్శనాలు పూర్తి అయిన తర్వాత వెంటనే నిమజ్జనం కోసం ఏర్పా్ట్లు చేయనున్నారు. మరి నిమజ్జనం చేసే ముందు ఖైరతాబాద్ గణేష్‌కు ఏయే పూజలు చేయనున్నారంటే?
ఇది కూడా చూడండి: Chandra Grahan 2025: చంద్ర గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!
గణపతికి ప్రత్యేక హోమం
గణేష్ శోభాయాత్ర సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 5వ తేదీ అర్థరాత్రి నుంచి చివరిసారిగా పూజలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా గణపతి హోమం నిర్వహిస్తారు. 11 రోజులు వినాయకుడిని పూజించినా చివరి రోజు హోమం చాలా ప్రత్యేకమైనది. అతని అనుగ్రహం పొందడం కోసం చివరిరోజు హోమం నిర్వహిస్తారు. ఆ తర్వాత శోభాయాత్రకు ముందు వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఇవి ఉండ్రాళ్లు, లడ్డూలు, వడలు, పాయసం, మోదకాలు ఇలా వినాయకుడికి ఇష్టమైనవి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిమజ్జనానికి బయలుదేరే ముందు వినాయకుడికి చివరిసారిగా హారతి ఇస్తారు. చివరగా వినాయక చవితి రోజున స్థాపించిన కలశాన్ని తొలగిస్తారు.
కలశం తొలగించి..
కలశం తొలగించిన తర్వాత పూజ పూర్తి అయినట్లే. ఈ కలశంలోని పవిత్ర జలాన్ని ఇంట్లో చల్లుతారు. దీనివల్ల మంచి జరుగుతుందని కొందరు నమ్ముతారు. ఈ పూజలు అన్ని పూర్తి అయిన తర్వాత శోభాయాత్ర ప్రారంభిస్తారు. అయితే విగ్రహానికి శోభాయాత్రకు తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ముందుగానే అనగా సెప్టెంబర్ 5వ తేదీనే విగ్రహం వద్ద వెల్డింగ్, షెడ్ కర్రలు తొలగిస్తారు. ఎంతో ఘనంగా భారీ ఊరేగింపుతో స్వామి వారికి శోభాయాత్ర నిర్వహిస్తారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా "గణపతి బప్పా మోరియా" అంటూ వినాయకుడిని పంపిస్తారు. ఆ తర్వాత వినాయకుడిని హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. చివరిసారిగా వినాయకుడిని నీటిలో ముంచే ముందు పూజ చేసి హారతి ఇస్తారు. వచ్చే ఏడాది మళ్లీ ఆనందంతో గణపతిని తీసుకురావాలని హారతి ఇస్తారు.
గణపతి శోభాయాత్ర రూట్ మ్యాప్
బడా గణేష్ ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.
ఇది కూడా చూడండి: TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే!