హైదరాబాద్ నిమజ్జనం చూసి షాకైన విదేశీ భక్తుడు.. | Foreigners At Ganesh Nimajjanam 2025 | Tank Bund
Khairatabad Ganesh: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం - Exclusive Photos
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర ట్యాంక్ బండ్‌కు చేరింది. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు జై గణేశా, జై జై గణేశా అంటూ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
Hyderabad Ganesh Nimajjanam: 40 గంటల పాటు.. 2 లక్షలకు పైగా గణపతులు నిమజ్జనం.. ఒక్క ట్యాంక్‌బండ్‌లో ఎన్నంటే?
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్లో నేడు 40 గంటల పాటు నిమజ్జనాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 2 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయని తెలిపారు. నేడు ట్యాంక్ బండ్లోనే 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు.
Khairatabad Ganesh Nimajjanam 2025 | మధ్యాహ్నం లోపు బడా గణేష్ నిమజ్జనం | Hyderabad Ganesh Immersion
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముందు చేసే పూజల ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఖైరతాబాద్ గణేష్‌ను నిమజ్జనం చేసే ముందు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కలశం తొలగిస్తారు. ఆ తర్వాత హారతి ఇచ్చి శోభాయాత్ర నిర్వహిస్తారు. చివరిగా నిమజ్జనం చేసే ముందు మరోసారి హారతి ఇస్తారు.
ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే.|Khairatabad Ganesh Nimajjanam Route Map | RTV
Ganesh Immersion : గంగ ఒడికి మహాగణపతి-LIVE
ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్-4 వద్దు మహాగణపతి నిమజ్జనం నిర్వహించారు. గంగ ఒడికి మహాగణపతి చేరే సమయంలో భక్తులు కేరింతలు కొట్టారు. గణేశ్ మహరాజ్ కు జై అంటూ నినాదాలు చేస్తూ వినాయకుడికి వీడ్కోలు పలికారు.
Ganesh Immersion : గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాయకుడు..ఉదయం 6గంటలకే శోభాయాత్ర ప్రారంభం..!!
నేడు హైదరాబాద్ సిటిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. నవరాత్రుల్లో మండపాల్లో ఘనమైన పూజలందుకున్న గణనాథులు నేడు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు బయలుదేరారు. ఖైరతాబాద్ వినియకుడి శోభాయత్ర ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. చివరిసారిగా గురువారం రాత్రి కలశ పూజ నిర్వహించారు. శోభాయాత్రను వేగవంతం చేస్తున్నారు పోలీసులు. ఉదయం 8గంటల కల్లా టెలిఫోన్ భవన్ కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి 10 వరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్.. మధ్యాహ్ననం 12 కల్లా ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉండేలా ప్లాన్ చేశారు అధికారులు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ గణపతి బప్పా మోరియా అంటూ గణనాథునికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నారు.