/rtv/media/media_files/2025/08/19/kcr-to-high-court-on-kaleshwaram-commission-report-2025-08-19-19-45-15.jpg)
KCR to High Court on Kaleshwaram Commission report
KCR HIGHCOURT : కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ఇటీవల ఇచ్చిన నివేదిక విషయంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంతా తప్పుల తడక అని ఆరోపిస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్‌రావు.. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
కాగా, కేసీఆర్ వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడాలనే ఉద్ధేశంతోనే కమిషన్ వేసిందని ఆయన ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి ఏది కావాలో ఆ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాగా, కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వానికి అనుకూలంగా పిటిషన్ ఉందని కామెంట్స్ చేశారు. దీనిపై విచారణ జరపాలని కేసీఆర్, హరీష్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read : వరుణ దేవా అండర్‌పాస్‌లో కారు కష్టాలు.. వైరల్ వీడియో
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన కాళేశ్వరం కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది కూడా. ఈ సందర్భంగా విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని సీఎం రేవంత్ తెలిపారు. అంతేకాదు.. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు. ఈ తరుణంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయంశమైంది.