/rtv/media/media_files/2025/08/18/lips-2025-08-18-09-46-02.jpg)
Lips
Vitamin B2, B12 Deficiency Symptoms: పెదాలు(Lips) ముఖంలో అత్యంత సున్నితమైన భాగం. ఇవి పలు విధులను నిర్వహిస్తాయి. మాట్లాడటం, ఆహారం తీసుకోవడం, భావోద్వేగాలను వ్యక్తపరచడం, నవ్వడం వంటి వాటిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పెదాలకు సహజంగా ఎరుపు రంగు వస్తుంది. దీనికి కారణం ఇవి చాలా సన్నని చర్మం కలిగి ఉండడం, లోపలి రక్తనాళాలు కనిపించడం. పెదాలకు సొంతంగా ఆయిల్ గ్రంధులు లేకపోవడం వల్ల ఇవి సులభంగా పొడిబారతాయి. అందుకే వాటికి నిరంతరం తేమ అందించడం చాలా అవసరం. పెదాలను జాగ్రత్తగా చూసుకోవడం, వాటిని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం. అయితే పెదాలు పగలడం సాధారణంగా వాతావరణం మారినప్పుడు కనిపిస్తుంది. కానీ ఈ సమస్య తరచుగా కొనసాగుతుంటే.. అది మీ శరీరంలో విటమిన్ల లోపానికి సంకేతం కావచ్చు. చాలామంది లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీ రాసినప్పటికీ.. పెదవులు పగులుతూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం శరీరానికి అవసరమైన పోషకాలు, ముఖ్యంగా కొన్ని విటమిన్లు అందకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పెదాలు పగలడానికి కారణాలు(Causes of Chapped Lips)
శరీరంలో నీటి కొరత, డిహైడ్రేషన్, చలి లేదా పొడి వాతావరణం, తరుచుగా పెదాలను నాలుకతో తడపడం, ధూమపానం లేదా పొగాకు వాడకం, విటమిన్ల లోపం, ముఖ్యంగా విటమిన్ B12 మరియు B2, కొన్ని మందుల దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే శరీరంలో విటమిన్ B2 లోపం వల్ల చర్మం పొడిగా మారి, పెదాలపై పగుళ్లు వస్తాయి. నోటి చివరన పుండ్లు, నాలుక వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా విటమిన్ B12 లోపం వల్ల పెదాలలో మంట, పగుళ్లు, అలసట, చిరాకు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని సరిచేసుకోవాటానికి విటమిన్ B12, B2 లోపాన్ని పూరించడానికి ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవాలి. వాటిల్లో పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం, ఆకుకూరలు, చిక్కుళ్ళు, సోయా ఉత్పత్తులు, మొలకెత్తిన గింజలు, ఆహారం ద్వారా ఈ విటమిన్లు అందకపోతే.. డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: దహీలో చియా సీడ్స్.. ఆరోగ్యానికి అదనపు బలమని తెలుసా..?
పెదాలను సంరక్షించుకోవడానికి రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఎండలో వెళ్ళేటప్పుడు SPF ఉన్న లిప్ బామ్ వాడాలి. వారానికి 2-3 సార్లు పెదాలకు స్క్రబ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు పెదాలకు బీట్‌రూట్ రసం రాయాలి. ఇది పెదాలకు సహజమైన రంగు మరియు తేమను ఇస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పగిలిన పెదాల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా ఆరోగ్యకరమైన, మృదువైన పెదాలు ఒక వ్యక్తి అందాన్ని మరింత పెంచుకోచ్చు. పెదాల ఆరోగ్యం మొత్తం శరీరం ఆరోగ్యానికి సూచికగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ మూడు అలవాట్లు ఎక్కువ డేంజర్.. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోండి..!!