/rtv/media/media_files/2025/08/19/car-viral-news-2025-08-19-08-05-22.jpg)
car stuck in floodwaters
భారీ వర్షాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో లేదా అండర్‌పాస్‌లలో వరదలు సంభవించడం సాధారణం. అలాంటి పరిస్థితుల్లో వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోవడం, ప్రయాణికులు భయంతో సాయం కోసం ఎదురుచూడటం జరుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలు మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో చోటుచేసుకున్నాయి.
Flash flood like situation in Thane due to heavy downpour pic.twitter.com/cCvv3YSe7O
— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 19, 2025
మహరాష్ట్రంలో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. థానేలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక అండర్‌పాస్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఈ వరదలో ఒక కారు చిక్కుకుపోయింది. కారులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి వరద నీటిలోకి దూకి, కారు వద్దకు చేరుకున్నారు.
Two locals swam to rescue two people stuck in a car in an underpass in #Thane#Rains#Mumbai#flooded#waterloggedpic.twitter.com/MtTQbqeaXr
— Vinay Dalvi (@Brezzy_Drive) August 19, 2025
కారు అద్దాలను పగులగొట్టి, లోపల ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఒక ఇనుప రాడ్డు సాయంతో కారు విండ్‌షీల్డ్‌ను పగలగొట్టి, ప్రయాణికులను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, స్థానికుల ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు.
ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల చాలా అండర్‌పాస్‌లు, రోడ్లు జలమయం అయ్యాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజలను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు. వారం రోజుల నుంచి ఉత్తర భారతదేశంలో క్లౌడ్ బరస్ట్ దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్ లో పదుల సంఖ్యలో వరదల్లో చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొన్ని రోజులుగ భారీ వర్షాలు కురుస్తున్నాయి.