/rtv/media/media_files/2025/12/14/kcr-to-conduct-meeting-on-december-19th-2025-12-14-16-24-42.jpg)
KCR to Conduct meeting on december 19th
బీఆర్‌ఎస్(brs) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(kcr) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఆయన బయటికి రానున్నారు. డిసెంబర్ 19న బీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరపనున్నారు.
Also Read: ‘తీహార్’తరలిపోతోంది..ఎక్కడికో తెలుసా?
KCR To Conduct Meeting
సాగునీటి హక్కుల కోసం తెలంగాణలో మరోసారి ప్రజా ఉద్యమం తప్పదని పార్టీ కార్యకర్తలతో అన్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశంలో తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి చర్చలు జరగనున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ఇప్పుడు 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు మోకరిల్లిందని కేసీఆర్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతుల కోసం ఇక్కడి నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఒక్కరూ కూడా దీనిగురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read: కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
తెలంగాణ సాగునీటి విషయంలో బీజేపీ విధానాన్ని ఎదుర్కోవాలంటే మరోసారి పోరాటలే శరణ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. ఈసారి కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వచ్చిఉండే ఈసమయానికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్ని గురించి మరింత లోతుగా చర్చించేందుకు డిసెంబర్ 19న కేసీఆర్ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
Follow Us