Tihar Jail:  ‘తీహార్‌’తరలిపోతోంది..ఎక్కడికో తెలుసా?

తీహార్ జైలు..ఈ పేరు వినగానే ఒకప్పుడు నేరగాళ్లలో మార్పు. వారి జీవితంలో సంస్కరణలు తీసుకొచ్చిన అమ్మ వేదికలాంటి ప్రాంగణం గుర్తుకు వస్తుంది. నేరగాళ్ల ప్రవర్తనలో మార్పకోసం ఈ జైలు ఎంతో ఉపకరించింది. మార్పుకు వేదికగా తీహార్ జైలును చెప్పుకునేవారు.

New Update
FotoJet (7)

‘Tihar’ is being moved

Tihar Jail :  తీహార్ జైలు.. ఈ పేరు వినగానే ఒకప్పుడు నేరగాళ్లలో మార్పు. వారి జీవితంలో సంస్కరణలు తీసుకొచ్చిన అమ్మ వేదికలాంటి ప్రాంగణం గుర్తుకు వస్తుంది. నేరగాళ్ల ప్రవర్తనలో మార్పకోసం ఈ జైలు ఎంతో ఉపకరించింది. మార్పుకు వేదికగా తీహార్ జైలును చెప్పుకునేవారు.  తీహార్ కారాగార ప్రాంగణంగా పిలిచే ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా గుర్తింపు చెందింది. ఢిల్లీలో ఉన్న ఈ జైలు.. ఖైదీల సంస్కరణ నిలయంగానూ పేరుగాంచింది. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ హయాంలో దీనికి ‘తీహార్ ఆశ్రమం’ అనే పేరు వచ్చేంతగా ఇక్కడ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇక్కడ  కరుడుగట్టిన నేరస్తులు, పేరుపొందిన రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల వరకు పలువురు నేరస్తులు శిక్షలు అనుభవిస్తుంటారు. ఖైదీలకు వృత్తి విద్య, ఆధ్యాత్మిక శిక్షణ, యోగా, తీహార్‌ బ్రాండ్ కింద వివిధ ఉత్పత్తులను తయారుచేసే అవకాశాలు ఇక్కడ కల్పిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తీహర్‌ జైలు త్వరలో తరలిపోతున్నదనే వార్త స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(delhi cm rekha gupta)  తాజాగా నగరంలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Also Read :  కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP

తీహార్ గ్రామం పేరుతో..

తీహార్ జైలు(tihar-jail) అనేది కేవలం ఒకే భవనం కాదు. ఒక గ్రామం. దీన్ని పశ్చిమ న్యూఢిల్లీలో 1958లో నెలకొల్పారుఉంది. ఈ జైలు పలు కేంద్ర జైళ్లతో కూడిన ఒక అతిపెద్ద సముదాయం. అధికారికంగా దీనిని ‘తీహార్ జైళ్లు’ అని కూడా పిలుస్తారు. మొదట ఈ కేంద్ర జైలు 1,273 మంది ఖైదీలను ఉంచేందుకు సరిపోయే సామర్థ్యంతో ప్రారంభమైంది. జైలు పరిపాలనా నియంత్రణ మొదట్లో పంజాబ్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత 1966లో ఢిల్లీ పరిపాలనకు బదిలీ  అయ్యింది. తీహార్ జైలు ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జైలు వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.

సామర్థ్యానికి మించి రద్ధీ

ఆ తర్వాత క్రమేణా తీహార్ జైలు సముదాయం భారీగా విస్తరించింది ప్రస్తుతం ఇందులో 10 వేర్వేరు కేంద్ర జైళ్లు (CJ-1 నుండి CJ-10 వరకు) ఉండటం విశేషం. ఈ జైలు అధికారికంగా దాదాపు 10,000 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. కానీ,  దీనిలో సామర్థ్యానికి మించి 15,000 నుండి 19,000 మంది ఖైదీలు ఉంటుంటారు. ఈ అధిక రద్దీ తీహార్ జైలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఈ జైలులో శిక్ష పడిన ఖైదీలు, విచారణలో ఉన్న ఖైదీలు మహిళా ఖైదీల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.

సంస్కరణలు తెచ్చిన కిరణ్ బేడీ

1990లలో కిరణ్ బేడీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (జైళ్లు)గా పనిచేసిన సమయంలో తీహార్ జైలు ప్రపంచ దృష్టిలో పడింది. ఆమె నాయకత్వంలో జైలులో పలు మానవతా సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటిలో ఖైదీల కోసం ధ్యానం, యోగా, వృత్తిపరమైన శిక్షణ, విద్యా కార్యక్రమాలు ప్రధానమైనవి. ఈ సంస్కరణలు జైలు వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది.  ఖైదీలలో సానుకూల మార్పులు తీసుకురావడంలో ఉపయోగపడ్డాయి. ఈ సంక్షేమ కార్యక్రమాల కారణంగా తీహార్ జైలు కేవలం ఖైదీలను నిర్బంధించే స్థలంగానే కాకుండా, సంస్కరణల కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది.

హింస, గ్యాంగ్ వార్‌లతో..

తీహార్ జైలును తరలించడానికి ఇక్కడ పెరుగుతున్న ఖైదీల సంఖ్య, భద్రతా సమస్యలు  ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. సుమారు 10 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉన్న జైలులో ప్రస్తుతం 19 వేల మందికి పైగా ఖైదీలు ఉండటంతో భద్రత, నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ జైలు నివాస ప్రాంతాలకు దగ్గరగా (తిలక్‌నగర్, హరినగర్ వంటి జనావాసాలకు సమీపంలో) ఉండటం వల్ల, చుట్టుపక్కల ప్రజల భద్రత, రక్షణ కోసం దీనిని నగర శివారు ప్రాంతంలోని నరేలాకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం బావిస్తున్నది. ఇటీవల జైలులో ఖైదీల మధ్య హింస, గ్యాంగ్ వార్ లాంటి సంఘటనలు పెరగడం కూడా ఈ ఆలోచనకు ఒక కారణంగాతెలుస్తోంది. 

Also Read :  పశ్చిమ బెంగాల్‌ తొలిదశ సర్ పూర్తి.. 58 లక్షల ఓట్లు తొలగింపు..

Advertisment
తాజా కథనాలు