తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం.. KCR సంచలన వ్యాఖ్యలు

ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి, కొందరు నాయకులు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరారు. వారితోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ లీడర్ తాటికొండ రాజయ్య ఉన్నారు.

author-image
By K Mohan
New Update
KCR rajaiah

KCR rajaiah Photograph: (KCR rajaiah)

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని సీఎం కేసీఆర్ అన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని గులాబీ నేత ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత సమక్షంలో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ నాయకులు, ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిలతోపాటు మరి కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read: మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే

ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ ఉప ఎన్నిక వస్తుంది. అందులో కడియం శ్రీహరి ఓడిపోయి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది బీఆర్ఎస్‌లో చేరుతారని రాజయ్య తెలపారు.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు