రేవంత్ రెడ్డికి ప్రజా పాలనపై చిత్తశుద్ధి లేదు. | Thatikonda Rajaiaha Comments On Revanth Reddy | RTV
TG: కడియం శ్రీహరి కులంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. త్వరలోనే కడియం కుటుంబం శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందని అన్నారు. బినామీ పేర్లతో కడియం భారీగా ఆస్తులను కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.
TG: కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం అవినీతి తిమింగలం అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య డమ్మీ మాత్రమే అని అన్నారు. కేసీఆర్ ను కడియం బ్లాక్మెయిల్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ టికెట్ రాలేదని నిరాశ పడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈరోజు రాజయ్యతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో సమావేశం అయ్యారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్.
మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయన ఇంటికెళ్లి ఆహ్వానించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.
గులాబీ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న అధికారికంగా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి, ఇందిరాకి తనను విమర్శించే హక్కు లేదన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ వివాదాల్లో తలదూర్చలేదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన గెలుపు ఖాయమన్నారు.