Postal Jobs 2025: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. టెన్త్ అర్హతతో 21,413 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.

New Update
Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్‌లకు నోటిఫికేషన్ రిలీజ్

Postal Jobs 2025: నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త వెలువడింది. టెన్త్ అర్హతతో పోస్టల్‌ శాఖ 21,413 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్-I జనవరి-2025 నోటిఫికేషన్‌లో ఏపీ 1215, తెలంగాణలో 519 పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్:

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) ఉద్యోగాలకు 10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 40 సంవత్సరాలుండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. బ్రాంచ్ పోస్టాఫీసులో పోస్టల్ కార్యకలాపాలను నిర్వహించడం, ఇండియా పోస్ట్, IPPB సేవల మార్కెటింగ్, ప్రచారం, మెయిల్ రవాణా, డెలివరీలకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. 

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: 

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)లో వివిధ పోస్టల్, ఆర్థిక కార్యకలాపాల్లో BPMకి సహకరించాలి. మెయిల్, IPPB లావాదేవీల డోర్ స్టెప్ డెలివరీలు చేయాలి. స్టాంపులు, స్టేషనరీ, ఇతర పోస్టల్ సేవలను సేల్‌ చేయాలి. పోస్టల్ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం కూడా చేయాల్సివుంటుంది. 

ఇది కూడా చదవండి: JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్

డాక్ సేవక్:
డాక్ సేవక్ ఉద్యోగ బాధ్యతల్లో మెయిల్, పార్శిల్స్ డెలివరీ చేయాలి. IPPB డిపాజిట్లు, విత్‌డ్రా, ఇతర లావాదేవీలను చూసుకోవాలి.
పోస్టాఫీసు కార్యకలాపాల్లో సహాయం చేయడంతోపాటు కేటాయించిన పోస్టాఫీసు పరిధిలోనే నివాసం ఉండాలి. 

దరఖాస్తు ప్రక్రియ:
2025 ఫిబ్రవరి 10 నుంచి ఆన్ లైన్ వేదికగా 2025 మార్చి 3 వరకు అప్లై చేసుకోవాలి. ఎడిటింగ్ కోసం మార్చి 6 నుంచి 8 వరకు అవకాశం ఉంటుంది.https://indiapostgdsonline.cept.gov.in/ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక దరఖాస్తుకు ముందు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

ఇది కూడా చదవండి: PM Modi: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు