/rtv/media/media_files/2025/02/03/RFjSxt2mzOtd8xoszSXd.jpg)
KCR meeting Photograph: (KCR meeting)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 5 లక్షల మందితో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యాచరన చేస్తోంది. గజ్వేల్ వేదికగా ఈ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలే ఎజెండా ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. అయితే ఈ సభ తేదీ ఇంకా ఖరారు కాలేదు. దాదాపు ఇదే నెల చివరిలోగానే మీటింగ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రైతుభరోసా, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలపై అలాగే నేతన్నలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలపై రేవంత్ సర్కారును ప్రశ్నించాలని గులాబీ పార్టీ ఆలోచిస్తోంది.
Also Read: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు
2 రోజుల క్రితం ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను కొడితే మామూలుగా ఉండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమావేశంలో ఫిబ్రవరి చివరిలోగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోందని చెప్పారు. అదే జరిగితే చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతి నుంచి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కే పరిమితమైయ్యారు. దీంతో కేసీఆర్ సభపై జనాల్లో ఉత్కంఠ నెలకొంది.