BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది. వారికి భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
High Court

Telangana High Court

కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. వచ్చే నెల 7కే విచారణను వాయిదా వేసింది.  మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కేసీఆర్‌, హరీష్‌ రావు తదితరులు కారణమంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. తమకు పరిధి లేదని పేర్కొంటూ మేజిస్ట్రేట్‌ కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో రాజలింగమూర్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ ను ఆయన దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్‌, హరీశ్‌ రావు తదితరులకు నోటీసులు జారీ చేసింది. దీంతో కేసీఆర్ హరీశ్ రావు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: Mohan Babu: మోహన్‌ బాబు అరెస్ట్‌ కి రంగం సిద్ధం!

ఆ అధికారం భూపాలపల్లి కోర్టుకు లేదు..

రివిజన్‌ పిటిషన్‌ను స్వీకరించే అధికారం భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని వారు పిటిషన్ దాఖలు చేశారు. ఆ కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను కొట్టివేసింది. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీశ్‌ రావు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జిల్లా కోర్టుకు విచారణ పరిధి లేదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం ఈ మేరకు తీర్పులు ఇచ్చిందని తెలిపారు. 
ఇది కూడా చదవండి: సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌పై రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు!

భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కోర్ట్ జారీ చేసిన ఆదేశాలు సరైన విధంగా లేవని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ న్యాయస్థానం ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా.. ఈ వ్యవహారంలో మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజలింగమూర్తికి కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు