/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t165158-2026-01-20-16-52-26.jpg)
Kavitha Telangana Jagruti in the Munsi 'Polls' race
Telangana Jagruthi : రాజకీయ పార్టీగా మారకముందే తెలంగాణ జాగృతి ఎన్నికల బరిలో నిలవనుందా? ఇండిపెండెంట్లుగా ఒకే గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధపడిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మొదట కేవలం నిజామాబాద్ మున్సిపల్ ఎన్నిక(Telangana municipal elections) ల్లో పోటీ చేసేందుకు మాత్రమే తెలంగాణ జాగృతి సిద్ధమైన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె అనుచరులు, జాగృతి కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రతి మున్సిపాలిటీలో సుమారు 20 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను దింపేందుకు కవిత(kalvakuntla-kavitha) వ్యూహరచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆశావహులతో సమావేశమయ్యారు. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్న జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 'సింహం' గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సాధ్యమేనా ?
ఇండిపెండెంట్లుగా బరిలోకి..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓటర్ల లిస్టు కూడా ప్రిపేర్ అవుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో కవిత తరఫున పలువురు తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఆమె అనుచరులు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ బాధితులు బరిలో దిగనున్నట్లు తెలుస్తున్నది. వీరంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి.. సత్తా చాటాలని భావిస్తున్నారు. వారి ప్రచారానికి కవిత మద్దతు తెలుపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘జనం బాట’ పట్టిన ఆమె.. ఎన్నికల్లో తన మద్దతుదారుల తరఫున ప్రచారంలోనూ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే పేరుకే ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగినప్పటికీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుతోనే అందరూ పోటీ చేయాలని తద్వారా ఈ ఎన్నికల ద్వారా తమ సత్తా చాటాలని జాగృతి ఉవ్విళ్లురుతోంది.
Also Read : ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
కవిత బలం తెలుసుకునేందుకే...
కాగా, బీఆర్ఎస్ నుంచి తెగతెంపులు చేసుకున్న కవిత.. మున్సిపల్ ఎన్నికల్లో తన మద్దతుదారులను బరిలో నిలపడం ద్వారా జనం నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పలువురు కవిత మద్దతుదారులు విజయం సాధించారని తెలుస్తోంది. ఇప్పుడు మున్సి పాల్ బరిలోనూ జాగృతిని నిలపడం ద్వారా భవిష్యత్తులో పార్టీ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకోవాలని చూస్తోంది. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పుకుంటున్న కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఎన్నికలను ఆమె వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. జనం ఎలా స్పందిస్తున్నారో టెస్ట్ చేసేందుకు మున్సిపల్ ఎన్నికలను ఆమె వేదికగా మలచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కవిత మద్దతుదారులు మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిస్తే.. మరింత జోష్ వస్తుందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ శక్తిగా ఎదిగేందుకు మార్గం సుగమమవుతోందని పలువురు జాగృతి నేతలు అభిప్రాయపడుతున్నారు.
Follow Us