/rtv/media/media_files/2025/05/31/qlS4KCBjKgnZmk6N9XsO.jpeg)
బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖతో పార్టీకి, ఆమెకు ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం కవిత మ్యాటర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నెమ్మదిగా కవితను పార్టీకి దూరంపెడుతున్నట్లు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఆమెపై చేసిన అనువ్యాఖ్యలపై పార్టీ సరైన రీతిలో స్పందించలేదు.
Also Read : BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?
Kavitha Out Of BRS
కొప్పుల ఈశ్వరన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, స్వయంగా బొగ్గుగని కార్మికుడు వారికి బొగ్గుగని కార్మిక సంఘం ఇంచార్జ్ భాద్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా..
— Telugu Reporter (@TeluguReporter_) July 17, 2025
- ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవిత#KalvakuntlaKavitha#TelanganaJagruthihttps://t.co/ykQpNjLrzPpic.twitter.com/0g28p69HSr
Also read : Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
ఎమ్మెల్సీ కవిత, తీన్మార్ మల్లన్న వివాదంలో కవితకు మద్దతుగా ఉంటామని టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో అన్నారు. కానీ సొంత పార్టీ బీఆర్ఎస్ మాత్రం శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసుదనాచారి పేరుతో సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఈ ఒక్క సంఘనటతో కవితకు పార్టీలో ఏ రేంజ్‌లో ప్రాధాన్యత తగ్గిందో అర్థం అవుతుంది. సొంత ఇంటి మహిళ, పార్టీ ఎమ్మెల్సీపై జరిగిన ఇష్యూలో కీలక నాయకులైన హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఎవ్వరూ స్పందించలేదు. ఇదే కాదు.. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో కవిత అధ్యక్షురాలిగా ఉంది. అయితే ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు.
జూలై 17న కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ సింగరేణి కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించారు. అయితే ఈ విషయంలో పార్టీ ఆమెను సంప్రదించలేదని వార్తలు వస్తు్న్నాయి. బీసీ వర్గీకరణ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని కవిత తప్పుబడుతున్నారు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు సాధ్యమవుతాయని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. గతకొంత కాలంగా ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు.
రాజకీయపరంగా కవితకు నిజామాబాద్ జిల్లా ఎప్పుడూ కీలకమైంది. గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆమెను.. నిజామాబాద్ జిల్లా బాధ్యతల నుంచి కూడా ఆమెను తప్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే కేటీఆర్, కవిత మధ్య అంతర్గత విభేదాలతో మరింత దూరం పెరిగే అవకాశం ఉంది.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!
brs-mlc-kalvakuntla-kavitha | brs | kcr | MLC Kavitha Issue