/rtv/media/media_files/2025/08/31/mlc-kavita-2025-08-31-21-06-05.jpg)
MLC Kavita
Kavitha Elected As President Of HMS
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kavitha) సింగరేణి వర్కర్స్ యూనియన్‌కు చెందిన హెచ్‌ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో HMS జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మాద్.. ఆమె పేరును ప్రతిపాదించారు. దీంతో ఏకగ్రీవంగా ఆమె ఎన్నికయ్యారు. అమెరికా పర్యటనను ముగించుకున్న కవింత సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. ఇటీవల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) అధ్యక్షురాలి పదవి నుంచి కవితను బీఆర్‌ఎస్ తొలగించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇది జరిగిన కొన్నిరోజులకే తాజాగా HMS అధ్యక్షురాలిగా కవిత ఎన్నిక కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
ఇప్పటిదాకా బీఆర్‌ఎస్(brs) కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘానికి గత పదేళ్లుగా అధ్యక్షురాలిగా ఉన్న కవిత.. ఇప్పుడు వేరే సంస్థకు అధ్యక్షురాలిగా ఎంపిక కావడం చూస్తుంటే బీఆర్‌ఎస్‌కు ఆమె మరింత దూరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
Also Read : కేసీఆర్‌కు నిజాం కంటే ధనవంతుడు కావాలనే దురాశ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Also Read : వినాయక విగ్రహాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్