Bandi Sanjay: బండి సంజయ్ నోట.. మోదీ పాట.. వీడియో వైరల్!
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
కరీంనగర్ లోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్ష రాస్తుండగా.. శివాన్విత అనే విద్యార్థిని పై తిరుగుతున్న ఫ్యాన్ ఊడిపడింది. ఫ్యాన్ రెక్కలు తగలడంతో శివాన్విత ముక్కు, కన్ను కింది భాగాల్లో స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెకు ప్రథమ చికిత్స చేయించి పరీక్ష రాయించారు
జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం వెలుగు చూసింది. జగిత్యాలకు చెందిన రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో పలువురి నుంచి రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం దుర్మారణం చెందారు. ప్రమాదవశాత్తు లిప్టులో పడి మృతి చెందారు. వెంకట్రావునగర్ లో సోమవారం రాత్రి సిరిసిల్ల డిఎస్పీని పరామర్శించి లిప్టులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మహిళా దినోత్సవం సందర్భంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ మహిళా ఉద్యోగులను సత్కరించారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జగిత్యాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో పెళ్ళికొడుకు కిరణ్ పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కరీంనగర్లో పెళ్లి బరాత్ ఓ మహిళ ప్రాణం తీసింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు ఫోన్ రావడంతో.. పెళ్లి కొడుకు నడిపాడు. అతివేగంతో నడపడంతో బరాత్ డ్యాన్స్ చూస్తున్న కొందరిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మళ్లీ మర్చిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ సీఎం శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు అంటూ ప్రసంగించారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు.