ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లకు మరో యువకుడు బలి.. రూ.10 లక్షల అప్పు చేసి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రూ.10లక్షలకు పైగా అప్పులపాలై వాటని కట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
online betting yuvakudu

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు  మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

Also read :  హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే..

రూ.10లక్షలకు పైగా అప్పులు

గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో కాపురం పెట్టాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తు్న్న సాయితేజ్.. బెట్టింగులకు బానిసయ్యాడు.  ఈ క్రమంలో రూ.10లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. వాటని కట్టలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో మార్చి 18వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయి తేజ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మంథనికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  Online Betting: మధురానగర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్..ముఠా అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం సీరియస్

మరోవైపు బెట్టింగ్ ప్రమోషన్స్ ను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో 25 మంది బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  నమోదైన కేసుల ఆధారంగా ఆయా బెట్టింగ్‌ యాప్స్ ను గుర్తించే పనిలో పడ్డారు. 

Also read :  బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పని ఎలా తెలుస్తుంది ?  అనన్య నాగల్ల సంచలన వ్యాఖ్యలు

Also read :  ఐపీఎల్ టీమ్స్ వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు