TG Politics: వివేక్, బాల్క సుమన్ సీక్రెట్ మీటింగ్.. అసలేం జరుగుతోంది?

తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది.

New Update

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి భేటీ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో 30 నిమిషాల పాటు సుమన్, వెంకటస్వామి చర్చలు జరిపారు. ఈ ఇద్దరిని చూసి కేటీఆర్ షాక్ అయినట్లు తెలుస్తోంది. సంభాషణ మధ్యలో వచ్చిన కేటీఆర్.. వాట్ ఏ సర్ ప్రైజ్ అన్నట్లు సమాచారం. అనంతరం  వివేక్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కాసేపు ముచ్చటించారు. ఈ సన్నివేశాన్ని ఓ ఎమ్మెల్యే ఫోటో తీసేందుకు ప్రయత్నించగా.. కేటీఆర్ వద్దని వారించడం ఇంకా ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురు 30 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి:Jagadeesh Reddy: తెలంగాణ అసెంబ్లీలో హైటెన్షన్.. మార్షల్స్ Vs జగదీష్ రెడ్డి!

రెండు సార్లు పోటీ పడ్డ నేతలు..

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కు రాజీనామా చేసి నాటి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 2014 ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు టీఆర్ఎస్ ను వీడి సొంతగూడు కాంగ్రెస్ కు చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీకి దిగగా.. టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో బల్కా సుమన్ ను బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో సుమన్ భారీ విజయం సాధించారు. 
ఇది కూడా చదవండి:TG MLC Election: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

ఆ తర్వాత కాంగ్రెస్ కు మరోసారి దూరమైన వివేక్.. బీఆర్ఎస్ అటు నుంచి బీజేపీ.. గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. ఈ ఎన్నికల్లో వివేక్ కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీకి దిగగా.. బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ తలపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వివేక్ విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇలా రెండు సార్లు వివిధ పార్టీల నుంచి తలపడ్డ ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీలో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

(telugu-news | latest-telugu-news | telugu breaking news | balka suman | gaddam vivek venkataswamy)

Advertisment
తాజా కథనాలు