/rtv/media/media_files/2025/03/22/FhrmPg2KO9IgytvlF80S.jpg)
CM Revanth KTR
సీఎం రేవంత్ తో హరీష్ రావు భేటీ తర్వాతే కేటీఆర్ చెన్నై వెళ్లారని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సమావేశం తరువాత రేవంత్ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయట పడిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇండియా కూటమిలో లేదన్నారు. అయినా కేటీఆర్ చెన్నై మీటింగ్ కు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ కలుస్తుందా? లేక పోతే మరెందుకు కేటీఆర్ అఖిల పక్షం మీటింగ్ కి వెళ్లారని? ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు..
బీఅర్ఎస్ అవినీతిని వంద రోజుల్లో బయటపెడతానని సీఎం రేవంత్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. అయితే.. అధికారంలోకి వచ్చి15 నెలలు గడుస్తున్నా బీఅర్ఎస్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. ఈ మీటింగ్ తో రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది అనే అనుమానాలకు బలం చేకూరిందన్నారు.
ఇది కూడా చదవండి: Komatireddy-Balakrishna: బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!
(Ktr | revanth-reddy | aleti-maheshwar-reddy | telugu-news | telugu breaking news)