Naveen Yadav: 30 ఏళ్లకే MLAగా పోటీ.. పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్.. నవీన్ యాదవ్ పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ ఇదే!

శ్రీశైలం యాదవ్ కుమారిడిగా 30 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం నుంచి బరిలోకి దిగి.. నియోజకవర్గ రాజకీయాల్లో తన ఫ్యామిలీ పవర్ ఏంటో చూపారు. 41, 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.

New Update
Naveen yadav Profile

హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025)ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ యాదవ్(naveen yadav) 20 వేలకు పైగా మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎవరు ఈ నవీన్ యాదవ్? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. నవీన్ యాదవ్ తండ్రి చిన శ్రీశైలం యాదవ్.. యూసఫ్‌ గూడ ప్రాంతంలోనే పుట్టి పెరిగాడు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శ్రీశైలం యాదవ్ రియల్ ఎస్టేట్ తో పాటు పీజేఆర్ శిష్యుడిగా పాపులర్ అయ్యారు. సినిమా వారితో ఆయనకు మంచి సన్నిహిత్యం ఉంది. పలు కేసుల్లో ఉండడంతో ఆయనపై రౌడీ షీట్ తెరిచారు పోలీసులు. దీంతో ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినా ఆయన రాజకీయంగా పెద్దగా ఎదగలేకపోయారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం యాదవ్ కుమారుడిగా 30 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నవీన్ యాదవ్. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో పని చేశారు.

Also Read :  🔴Jubilee Hills By Election 2025 Results: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో సంబరాలు లైవ్ అప్‌డేట్స్..!

Congress Candidate Naveen Yadav Background

Also Read :  Jubilee Hills Bypoll Result : జూబ్లీహిల్స్ పై రేవంత్ 6 అస్త్రాలు.. కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాలివే!

2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం నుంచి బరిలోకి దిగి.. నియోజకవర్గ రాజకీయాల్లో తన ఫ్యామిలీ పవర్ ఏంటో చూపారు. 41, 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని మూడు స్థానంలోకి నెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2018లో ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి 18,817 ఓట్లు సాధించారు. వరుస ఓటములు ఎదురవుతున్నా నవీన్ యాదవ్ మాత్రం తగ్గలేదు. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వచ్చారు. ముఖ్యంగా వేలాది మంది మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించడం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ఆయనకు స్థానికంగా మంచి పేరు తీసుకువచ్చాయి. 

సమస్య అని దగ్గరకు వచ్చే వారికి సాయం చేస్తూ సౌమ్యుడిగా ఆయనకు పేరు ఉంది. దీంతో పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకున్నారు నవీన్. దీంతో కుటుంబంపై ఉన్న రౌడీ షీటర్ ముద్ర ఆయనపై పడలేదు. అయితే.. 2023 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి అభ్యర్థి అజారుద్దీన్ గెలుపుకోసం కృషి చేశారు. ఆ ఎన్నికల్లో అజారుద్దీన్ ఓడిపోయారు. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గోపినాథ్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఎలాగైనా ఇక్కడ గెలిచి హైదరాబాద్ నడిబొడ్డున జెండా పాతాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ కు నవీన్ యాదవ్ మంచి అస్త్రంగా కనిపించారు.

దీంతో ఎంత మంది సీనియర్లు పోటీ పడ్డా ఆయనకే టికెట్ ఖరారు చేసింది హైకమాండ్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పక్కా ప్లాన్ తో ప్రచారం నిర్వహించారు నవీన్ యాదవ్. ప్రచారానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పక్కాగా ఓడిపోతుందన్న అంచనాలను రివర్స్ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

Advertisment
తాజా కథనాలు