/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
కరీనంగర్ జిల్లా మానకొండూరు మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. సదాశివపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
Also read: బీహార్ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బీజేపీ, జేడీయూ కన్నా ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు
బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us