Road Accident : మరో ఘోర బస్సు ప్రమాదం.! స్పాట్‌లో 8 మంది..

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుండి వచ్చిన  ఆర్టీసీ రాజధాని బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.

New Update
FotoJet - 2025-11-16T102210.497

Another serious bus accident! 8 people on the spot..

Road Accident: తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. వాహనదారులు మీతిమిరిన వేగంతో నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే జనగామ జిల్లాలో ఇవాళ(ఆదివారం)  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుండి వచ్చిన  ఆర్టీసీ రాజధాని బస్సు (TG 03Z 0046) ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా మృతులను పులమాటి ఓం ప్రకాష్  (75)దిండిగల్, నవదీప్ సింగ్ ,బాలసముద్రం హన్మకొండకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే, ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.

 స్థానికులు వెంటనే జనగామ పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. రాజధాని బస్సు అత్యంత వేగంగా రావడం  వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాజధాని బస్సు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతోపోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు