/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఏడతెరపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గంట సేపు వర్షం పడితే ఎక్కడ నీరు అక్కడే నిల్వ ఉండిపోతుంది. దీంతో నగరంలోని ప్రజలు ఆఫీసులకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. నేడు తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా నీట మునిగాయి. ముఖ్యంగా సెల్లార్లు ఉండే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా భారీ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఇది కూడా చూడండి: Uttarakhand Cloudburst: రాబోయే 24 గంటల్లో ఉత్తరకాశీలో భారీ వరదలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!
TELANGANA RAINFALL FORECAST – 8 AUGUST
— Hyderabad Rains (@Hyderabadrains) August 8, 2025
Today, West, Central, North & South Telangana are set to witness HEAVY DOWNPOURS, with #Sangareddy, #Vikarabad, #Kamareddy, #Medak, #Asifabad, #Narayanpet, and #Gadwal having the highest chances of intense rainfall. ⛈️
For #Hyderabad,…
ఏపీలోని ఈ జిల్లాల్లో..
ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను సూచించారు.
VIDEO | Andhra Pradesh: Tirupati witnesses heavy rain with thunder and lightning, causing waterlogged roads.
— Press Trust of India (@PTI_News) August 8, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/yfWY7WFQ0A
ఇది కూడా చూడండి:Weather Update: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు!