/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై కక్ష గట్టి బయటికి పంపించారని.. పార్టీ ఎప్పుడు కూడా ఆమెకు అండగా లేదంటూ వాపోయారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కవిత మండలి నుంచి బయటికి వచ్చాక గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి(Telangana Jagruthi) పోటీ చేస్తుందని అన్నారు. '' నాకు జరిగిన అవమాన భారంతో ఇంటి, పార్టీ బంధాలు వదులుకొని బయటకు వచ్చాను. నా రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ కు విజ్ఞప్తి చేశాను. తెలంగాణ జాగృతితో కలిసి పనిచేసేందుకు లెఫ్ట్ పార్టీలను, మావోయిస్టు సానుభూతిపరులని ఆహ్వానిస్తున్నాను.
Also Read : మహబూబ్‌నగర్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
Jagruthi Will Contest In Next Elections
రాజకీయాల్లో నైతికత అనేది అవసరం. నాడు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతోమంది పార్టీ కోసం కష్టపడ్డారు. తెలంగాణ ద్రోహులు బీఆర్ఎస్(brs) పార్టీలో చేరిన తరువాత నిజమైన ఉద్యమకారులకు అన్యాయం చేశారు. నాలాంటి ఒకరిద్దరికి మాత్రమే అవకాశాలు వచ్చాయి. అనేక రకాలుగా మాలాంటి వారిని ఇబ్బందులు పెట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు చేశారు. లక్షల కోట్లు ఖర్చు చేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వలేక పోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాగుంటుందని చాలామంది నమ్మారు. కానీ అందరి ఆశలు అడియాశలయ్యాయి.
తెలంగాణ ఉద్యమకారులకు ఐడి కార్డ్స్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ రెండేళ్లలో ఆ పార్టీ చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారు. అందుకే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో మరో పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ జాగృతి ముందడుగు వేసింది. ఈ సంస్థ రాజకీయ పార్టీగా ఎదుగుతుంది.
తెలంగాణ జాగృతి నిరుద్యోగులకు రాజకీయ వేదిక అవుతుంది. నేను ఎవ్వరి మీద ఆధారపడి పని చెయ్యను. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. తెలంగాణ జాగృతి దళితులు, మైనార్టీల కోసం పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుంది. రాజకీయాల్లోకి వచ్చేవారికి జాగృతిలో చోటు కల్పిస్తామని'' కవిత అన్నారు.
Also Read : 2 గంటల్లోనే ఆపరేషన్ సక్సెస్.. అమెరికా చేతిలో వెనిజులా ఖతం
Follow Us