Hyderabad: సోషల్ మీడియాలో వచ్చే ప్రతిది నిజమని నమ్మితే మోసపోక తప్పదు. వ్యాపారం పేరుతో కొందరు, ఉపాధి పేరుతో కొందరు, అవకాశాల పేరుతో మరికొందరు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ప్రచారం చేస్తుంటారు. పలువురు సైబర్ నేరగాళ్లు ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే అవి నిజమా కాదా అని ఒకటికి రెండు సార్లు ఫ్యా్క్ట్ చెక్ చేసుకోవలసిన బాధ్యత మనపైన ఉంటుంది. లేదంటే మోసపోక తప్పదని ఈ ఘటన రుజువు చేసింది. పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి వ్యక్తి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్ చూస్తుండగా, నోమురా యాప్ ప్రమోషన్ వీడియో కనిపించింది. వెంటనే వారిని కాంటాక్టు అయ్యాడు. ఆన్‌లైన్ పెట్టుబడులు, వ్యాపారం, తక్కువ సమయంలోనే లక్షలు ఎలా సంపాదించొచ్చు అనేది ఆ రీల్‌లో చూపించడంతో ఆసక్తి తో వారిని కాంటాక్ట్ అయ్యాడు. తానుకూడా వారి లాగా పెట్టుబడి పెట్టి లాభాలు గడించాలని ఆశ పడ్డాడు. ఇన్ స్టాలో వారు చెప్పేది నిజమని నమ్మిన బాధితుడు అందులో ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేశాడు. అటునుంచి నేహా అయ్యర్ పేరుతో లైన్‌లోకి వచ్చిన మహిళ ట్రేడింగ్‌కు చెందిన వివరాలను వివరించింది. ఆసక్తి ఉంటే చేరవచ్చని తెలిపింది. తన ఇష్టన్ని వెల్లడించడంతో అతడిని వెంటనే ఓ గ్రూపులో చేర్చింది. సదరు గ్రూపులో పెట్టుబడులు పెడుతున్న వారికి చాలా లాభాలు వచ్చినట్లు చూపించడంతో తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వస్తున్న లాభాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ మరింత రెట్టింపయ్యింది. వెంటనే అతడు కూడా విడతల వారీగా రూ. 9,65,400 పెట్టుబడి పెట్టాడు.
Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా
ఆయన పెట్టుబడికి ఆ డబ్బుకు రూ.27,51,400 లాభాలు వచ్చినట్లు యాప్‌లో కనిపించింది. వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ఆప్షన్ క్లోజ్ అయింది. ఆ డబ్బు తీసుకోవాలంటే మరో రూ.18 లక్షలు చెల్లించాలని ఎదుటివారు డిమాండ్ చేయడంతో ఇదంతా సైబర్ మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇది కూడా చూడండి: Crime News : థూ..ఏం కొడుకువురా...కన్నతల్లినే చెరబట్టిన కొడుకు...కొట్టి చంపిన తండ్రి
Hyderabad: కొంప ముంచిన ఇన్‌స్టాగ్రామ్.. ఆ రీల్ చూసి ఫాలో అవుతే ఏం జరిగిందంటే..
పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి వ్యక్తి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్ నిర్వాహకుల ముసుగులో సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
instagram Fraud
Hyderabad: సోషల్ మీడియాలో వచ్చే ప్రతిది నిజమని నమ్మితే మోసపోక తప్పదు. వ్యాపారం పేరుతో కొందరు, ఉపాధి పేరుతో కొందరు, అవకాశాల పేరుతో మరికొందరు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ప్రచారం చేస్తుంటారు. పలువురు సైబర్ నేరగాళ్లు ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే అవి నిజమా కాదా అని ఒకటికి రెండు సార్లు ఫ్యా్క్ట్ చెక్ చేసుకోవలసిన బాధ్యత మనపైన ఉంటుంది. లేదంటే మోసపోక తప్పదని ఈ ఘటన రుజువు చేసింది. పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి వ్యక్తి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ఇది కూడా చూడండి:Road accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు