/rtv/media/media_files/2025/09/15/road-accident-on-outer-ring-road-2025-09-15-10-41-38.jpg)
Road accident on Outer Ring Road
Road accident : పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్ పై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతిచెందగా.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. . ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్‌ఆర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో
ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులంతా సరళమైసమ్మ టెంపుల్ కు వెళ్ళి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వీరు ప్రయాణిస్తున్న వెళుతుండగా ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం కావొద్దని.. ప్రాణాలను రిస్కులో పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా సౌమ్య రెడ్డి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధితులంతా ఇన్ఫోసిస్ ఉద్యోగులే కావడంతో తోటి ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?